Friday 29 February 2008

బహు తేలికైన పని

లోకంలో నూడుల్స్ చెయ్యటం కంటే తేలికైన పని ఏదయునా ఉంది అంటే అది బహుశా ఉచిత సలహాలు/అభిప్రాయాలు విరజిమ్మటమేనేమో...

"లాభం లేదండీ, ఇక్కడొక ఫ్లై-ఓవర్ లేపాల్సిందే" నిస్సిగ్గుగా ఫుట్ పాత్ మీదకి బైక్ ఎక్కించేసి, సిగ్నల్ కోసం ఆత్రంగా ఎదురుచూసే ఓ పెద్ద మనిషి వ్యాఖ్యానం...

"వ్యవస్థ లో సమూలంగా మార్పు రావాలండీ..ఈ కుళ్ళు రాజకీయాలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందా అని అనిపిస్తుంది" వాపోతుంటాడు ఎన్నడూ ఓటెయ్యని ఓ ప్రబుద్ధుడు...

"మనమూ ఒక బ్లాగు పెట్టేసి జనాలకి ఉపదేశం చేసేస్తేనో" అని ఆఫీసు టైం లో తెగ ఆలోచించేస్తుంటాడు నాలాంటి ఓ బడుద్ధాయి...

ఎక్కడో చదివాను...

ఓ పెద్దమనిషి బ్రతికినన్నాళ్ళూ సమాజాన్ని ఎలా సమూలంగా మర్చేద్దామా అని తెగ ప్రయత్నించి ప్రయత్నించి ఓడిపోయాట్ట. చరమాంకం లో జ్ఞానోదయం అయి తన సమాధి దగ్గర ఇలా నోట్ వ్రాపించుకున్నాడట:

"సత్యం ఆలస్యంగా అవగతం అయ్యింది...సమాజాన్ని మార్చాలనే తపనలో నా గురించే మర్చాను! మార్పుని నాతో మొదలుపెట్టి నా వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా మలచుకుని ఉంటే, నన్ను చూసి కనీసం నా కుటుంబం మారేదేమో. నా కుటుంబాన్ని చూసి ఇరుగు పొరుగు, వారిని చూసి నా ఊరు, ఊరిని చూసి సమాజం మారేదేమో కదా"

లోకం సంగతి తర్వాత తమ్ముడూ...ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం!!

5 comments:

Purnima said...

simple vishayaani bale sootigaa chepparu :-)

పుల్లాయన said...

chala baga chepparu

dingu said...

samskarinchukovadaniki naalo tappulu kanabadatamledu pakkana valle anni tappulu chestunnaru annaa........ ee prapancham mottam kullipoyindi

Unknown said...

మీరు ఏ పోస్ట్ రాసినా ఆరంభం , ముగింపు చాల బాగా రాస్తారు. అంటే మిగతాది బావుండదు అని కాదు. అలా క్లుప్తంగా రాయడం నాకు అస్సలు రాదు.

Siva said...

శైలబాల గారూ..మీ అభిమానానికి ధన్యవాదాలు! నాకు తోచిన చిన్న చిన్న విషయాలు నలుగురితో పంచుకోవాలన్నా తపన, వీలైనంత సూటిగా చెప్పాలన్న ఉద్దేశ్యం తో వ్రాయటం వల్లనేమో కొంచెం క్లుప్తం గా ఉంటాయి. మీ అందరినుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది..సవినయంగా చెప్తున్నానీమాట!