Tuesday, 8 April 2008

లేక్ వ్యూ అపార్టుమెంటు - హిల్ వ్యూ రిసార్టు

గమనిక: టపా మొదలు చూసి ఇదేదో పిల్ల రచయిత ప్రకౄతి వర్ణనకు చేసే ప్రయత్నమో, లేక నా సొంత బాకానో అనుకునేరు సుమా :-) ఓపికుంటే చివరివరకు చదవండి.

ఈ మధ్యే బెంగుళూరు శివార్లలో నా కష్టార్జితంతో - అంటే ఆర్జించినది, మరియు ఆర్జింపబోవునది(హోమ్ లోన్) అని చెప్పుకోవాలి - కొన్న అపార్టుమెంటులోకి గౄహప్రవేశం చేశాము. బుక్ చేసిన టైంలో బిల్డరు ఊదరగొట్టిన హంగులతోపాటు మా ఈ అపార్టుమెంటుయొక్క అదనపు ఆకర్షణ లేక్ వ్యూ అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను.శివారుప్రాంతం అని చెప్పాను కదా, చుట్టుపక్కల ఇంకా ఏమీ ఇళ్ళు లేవు...బాల్కనీలోనుంచి మూడు దిక్కులా కనుచూపుమేర పచ్చదనమే. ఏపుగా పెరిగిన కొబ్బరి తోటలు, వరి చేలు, ఈ పచ్చదనం మధ్య జలకళతో ఉట్టిపడుతున్న నిండైన చెరువు! నీరెండలో ఈ సౌందర్యాన్ని కళ్ళారా చూడాలే తప్ప వర్ణింపనలవి కాదు!

మొన్నా మధ్య కేరళలోని మున్నార్ కి విహార యాత్రకని వెళ్ళాను. అసలే ప్రకౄతి ప్రేమికుడిని కదా...రెండు నెలలు శోధించి, టూర్ ఆపరేటర్లను వేధించి, అద్భుతమైన రిసార్టుని బుక్ చేశాను. నిజం చెప్పొద్దూ..వెళ్ళి చూసాక నా సెలెక్షన్ని నేనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాను! ఈ మధ్యే కట్టిన రిసార్టు అది...కొండ కొమ్మున ఉంది, కేవలం పచ్చరంగునే వాడి సౄజించిన ఓ అద్భుతమైన పెయింటింగ్ లా ఉంది ఆ పరిసర వీక్షణం! పనిగట్టుకు చూసినా ఎక్కడా జనావాసాలే అగుపించవు మరి! అనుక్షణం ఆనందానుభవం ఆ యాత్ర..

******************************************

మా అపార్టుమెంటుకి పదేళ్ళునిండాయి. మొన్నీమధ్యే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నాం. కాని ఇప్పుడు అపార్టుమెంటు గురించి చెప్పుకోవటానికి ఆకర్షణ అంటూ ఏమీ లేదు. ఇప్పుడది శివారుప్రాంతం కాదు, నగరంలో పేరొందిన ఓ కాలనీ. బాల్కనీ లో కూర్చుని ఆస్వాదించటానికి చుట్టూ పచ్చని చేలు ఏమీ లేవు...పిచ్చుకగూళ్ళలాంటి బిల్డింగులు తప్ప. ఇప్పుడా చెరువు ఉందోలేదో కూడ తెలియదు...ఆ వ్యూ కి అడ్డంగా బిల్డింగులు వచ్చి చాలాకాలం అయ్యింది. చుట్టు పక్కల బోర్లు ఎక్కువై, నీళ్ళు చేరే దారులు కూడా మూసుకుపోయి, ఇప్పుడందులో నీళ్ళు కూడా అడుగంటాయని అంటున్నారు :-(

ఆ కేరళ రిసార్టుకి కూడా పదేళ్ళు నిండాయి. ఈ మధ్యే మా కొలీగ్ వెళ్ళివచ్చాడు. అక్కడ కూడా అదే పరిస్థితట. టూరిస్టులు బాగా పెరగటంతో రిసార్టులూ ఎక్కూవయ్యాయి, ఊరూపెరిగింది, చుట్టూరా కాంక్రీట్ జంగిల్ తప్ప కొండాకోనలున్న ఆనవాళ్ళు ఎమీ లేవని అన్నాడు. పదేళ్ళలో ఎంతమార్పు...ఆలోచిస్తుంటే మనసుకి ఎలాగో అనిపిస్తుంది. అప్పటి స్వచ్చమైన గాలి, అందమైన ప్రకౄతి ఇప్పుడెక్కడ? లోకం ఇలా మారిపొతుంటే నాబోటి ప్రకౄతి ప్రేమికుని గతేంకాను?? ఈ నగరీకరణ మనల్ని ఎటు తీసుకుపోతుంది?

******************************************

ఇలా అనుక్షణం ఆలోచనలతో సతమతమవుతున్న నాకు ఓ శుభోదయాన బాల్కనీలో కూర్చుని ఉండగా జ్ఞానోదయం అయ్యింది. ఈ ప్రకౄతి ప్రేమికుడు గడచిన పదేళ్ళలో ప్రకౄతికేమి చేసాడనే ప్రశ్న బుర్రలో ఉదయించింది. చుట్టూ వచ్చి పడుతున్న బిల్డింగుల వల్ల చేలన్నీ మాయమైపోతుంటే నిట్టూరుస్తూ కూర్చోవటం తప్ప ఇప్పటి వరకు సొంత అపార్టుమెంటులో ఓ చెట్టు(మొక్క) కూడా నాటలేదే! మరి మొదటి చేను మా అపార్టుమెంటుకే కదా బలి అయ్యింది!! రోజూ వేల లీటర్ల చొప్పున బొరునుంచి నీటిని తోడటమే తప్ప ఎన్నడైనా వాన నీళ్ళు సద్వినియోగం చేసుకుందాం అనే ఆలోచనే రాకపోయెనే! చుట్టూ జనావాసాలే కనిపించని రిసార్టుకోసం వెతికి మురిసిపోయానే తప్ప అదే పచ్చని ఆ పరిసరాలలో మొదటి మచ్చ అని తట్టలేదే!

ఇతరులమీద నెపం వేసి తప్పించుకోవటం తేలికే. మన పక్కవాడికి మనం కూడా "ఆ ఇతరుల" లో ఒకళ్ళమే!

8 comments:

రానారె said...

ఒక ఆదివారం ఆంధ్రజ్యోతిలో తాంబూలం శీర్షికన మృణాలిని రాశారొక సంభాషణ -

"ఈ యిల్లు ...?"
"నాదేనండి"
"ఓ... యిది మీదేనన్నమాట!!?"
"అంటే... సిటీబ్యాంకు వారిది కూడా."


నా కష్టార్జితంలో - అంటే ఆర్ఝించినది, జింపబోవునది - అని మీరంటుంటూ జ్ఞాపకానికొచ్చింది. ప్రతి మనిషీ ఒక సొంత యిల్లు సమకూర్చుకునే అవకాశాలు కలిగినపుడు చెట్లకు కష్టకాలమే. ఇది తప్పదనుకుంటాను.

దాదాహయత్ చెప్పిన కథొకటుందీయంశంపై, మీరు చదివారా.

Anonymous said...

@రానారె: లేదండీ..ఆ కథకు సంబంధించి ఏదైనా లంకె ఉంటే పంపగలరు.

రాధిక said...

చిన్నప్పుడు మన పొలాల మధ్యలో ఇల్లు కట్టుకుని అక్కడే వుందామని అన్నప్పుడు, అందరూ అలాగే అనుకుని ఇళ్ళు కట్టేసుకుంటే ఇంక పొలం అందం ఏముంటుంది అని నవ్వుతూ సమాధానం చెప్పిన తాతయ్య మాటలు గుర్తొచ్చాయి.

chandramouli said...

హ హా... మరి అవ్వాకావాలి బువ్వాకావాలి అంటే ఎలాగండి....
ఎంత మెక్క నాటిన పూల పందిరి మించి పెద్ద మెక్క నాటలేము ...ఒక వేళ నాటిన అది పెరిగి పక్కింటి/మన గోడ కూల్చుంతుంది.

కొన్నింటిని అలా చూస్తూ ఉండాలి .... అంతకు మించి ఆలోచించ రాదు అని అప్పుడప్పుడూ అనుకుంటుంటాను...

Siva said...

నిజంగా మనసుంటే మార్గం లేకపోదు. అన్ని చెట్లూ గోడలని కూల్చవు..మా అపార్టుమెంటులో చెట్లు నాటమని అడిగినప్పుడు బిల్డరు ఇదే వంకపెట్టి తప్పించుకోవాలని అనుకున్నాడు. మేము పట్టు పట్టి దాదాపు 100 చెట్లు నాటించాం (8 ఎకరాల పెద్ద కాంపస్ మాది).

వాన నీటి సంరక్షణ కూడ సులువైందే...

చెయ్యలేము అని చెప్పటానికి 100 సాకులు వెతకొచ్చు....చెయ్యగలను అనుకోవటానికి ఒక్క సాకు చాలు!!

anand said...

siva garu ...chala chakkati post raasaaru ..indeed an eye opener for the likes of me who lead a mechanical life grossly overlooking the need of the hour ,restoration of nature and ecology ..
the bottom line here is (which i feel ) everyone is right in their own rights ....owner of the property expects more constructed area and so does the builder (in order to match with the demands of the owner)...blah blah .....in thew bid to match the demand and supply of dwelling space ,the prime victim is nature (hapless trees)...
ignorance of law is also a crime sir ..why dont we start with insisting the builder to provide recharging pits and some plantations all round the property (appts et al)..
but who has the time ,,,when u feel the intensity of the heat than u start cussing the builder etc ,,hahahaha...smart guys indeed ...as u sow so u reap ,,,save nature so that the nature will save u in present and ur future ...if u fail to think on those lines whining is the only hobsons choice ...
edo vaana kaalapu chaduvu gaadini midi midi gnam to edo raasanu anadha bhavinchakandi ..god bless us all ..lets all save nature (heartiest gud wishes siva to throw light on a burning topic ..lets all hurry up before its too late

Unknown said...

ఇలా అనుక్షణం ఆలోచనలతో సతమతమవుతున్న నాకు ఓ శుభోదయాన బాల్కనీలో కూర్చుని ఉండగా జ్ఞానోదయం అయ్యింది. ఈ ప్రకౄతి ప్రేమికుడు గడచిన పదేళ్ళలో ప్రకౄతికేమి చేసాడనే ప్రశ్న బుర్రలో ఉదయించింది. చుట్టూ వచ్చి పడుతున్న బిల్డింగుల వల్ల చేలన్నీ మాయమైపోతుంటే నిట్టూరుస్తూ కూర్చోవటం తప్ప ఇప్పటి వరకు సొంత అపార్టుమెంటులో ఓ చెట్టు(మొక్క) కూడా నాటలేదే! మరి మొదటి చేను మా అపార్టుమెంటుకే కదా బలి అయ్యింది!! రోజూ వేల లీటర్ల చొప్పున బొరునుంచి నీటిని తోడటమే తప్ప ఎన్నడైనా వాన నీళ్ళు సద్వినియోగం చేసుకుందాం అనే ఆలోచనే రాకపోయెనే! చుట్టూ జనావాసాలే కనిపించని రిసార్టుకోసం వెతికి మురిసిపోయానే తప్ప అదే పచ్చని ఆ పరిసరాలలో మొదటి మచ్చ అని తట్టలేదే!Hats off. mari modalupettandi acharana karyakramam...comments moderation unnapudu inka word verification enduku pls teseste memu boledu comments rastam ledante meke nastam

Siva said...

@ Anand garu:

Thank you for sharing your views. I do agree that it's not an easy thing..especially since we've come along so far in this possibly irreversible direction. But there can be small initiation. It's my personal experience - I could do some thing in my apartment, and of course still lot to do!

And the best thing is to analyze each one of us, and see the our impact on the nature due to our lifestyle. I can give an example of some Europeans who lead luxury life (thereby consuming plenty of natural resources) but are passionate about communicating the message by driving to work on cycle. It's an irony! Uless we change ourselves first, to minimize our foot print, what ever we do are only a false hope, only to satisfy ourselves

Regards,
Siva