నా చిన్నారి నేస్తాల గురించి ఇప్పటి వరకు మీకు పరిచయం చెయ్యలేదు కదూ??
అవి నాకు ఆరోతరగతి నుంచి పరిచయం. అప్పుడు మాకు తెలుగులో వాటి గురించి కవిత ఉండేది..ఎవరు వ్రాసారో గుర్తు లేదు, కవిత కూడా గుర్తులేదు కానీ, నేస్తాలు ఇప్పటికీ ఉన్నాయి.
ఇక్కడ కూడా ఉన్నాయి..అవును, ఇక్కడ నేను రోజూ నడచి వెళ్ళేదారిలో కనిపిస్తాయి. చిట్టి చిట్టి నవ్వులతో తమని ఎవరైనా పలకరిస్తారేమో అని రోజూ ఆశగా ఎదురు చూస్తుంటాయి. దారిన పోయే ప్రతి వారినీ కుశలమడుగుతాయి. కానీ పాపం వాటిని ఎవరూ అసలు పట్టించుకోరు. ఇంకొందరైతే నిర్దాక్షిణ్యంగా వాటిని .... :-(
పాపం నేను దూరం నుంచి పలకరించగానే ఎంత సంతోషమో వాటికి..చిన్న పాటి స్పర్శకే ఎంత సంబరమో వాటికి! ఆ స్పర్శ కోసమే ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్నట్లు! కాదా మరి.. మూణ్ణాళ్ళ ఆయువే ఇచ్చాడు వాటికా దేవుడు. ఆ ముణ్ణాళ్ళల్లోనే క్షణ క్షణ గండం!
ఇకనుంచైనా మనం ఈ చిట్టి నేస్తాలని అప్యాయంగా పలకరిద్దామా? అసలు మన సొమ్మేం పోతుంది నోరు తెరిచి "బావున్నావా?" అని వాటిని ఓ మాట అడిగితే? అడుగుతారు కదూ??
ఓ..ఇంతకీ ఈ నేస్తాలెవరో చెప్పనేలేదు కదూ.. ఈసారి నడిచి వెళ్ళేటప్పుడు కొంచెం తలదించి చుట్టూపక్కల వెతకండి కనిపిస్తాయి..
గడ్డి పూలు!!
అవును...పూజకీ, అలంకారానికీ పనికి రాని చిన్నపాటి గడ్డి పూలు. చూడగలిగే మనసు ఉంటే అవెంత అపురూపమో తెలుస్తుంది. వినగలిగే మనసు ఉంటే రోజూ అవి మనకి చెప్పుకునే ఊసులూ అర్థమౌతాయి. అలా తెలుసుకొని, అర్థం చేసుకొన్న నాడు తలదించుకునే నడుస్తాం మనం!
Wednesday, 18 May 2011
నా చిన్నారి నేస్తాలు...
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
:-) chala baga chepparu.. Mee prakruthi aaradana nachindi..
Very nice post.
BTW. ఓలమ్మోర్నాయనో.. నాకు ఆనందమేసేస్తోంది ! Becoz my blog is "gaddipulu".
@ Praveen garu: thanks for your compliment. చాలా చిన్న విషయమే ..కాని ఎందుకో చెప్పాలనిపించింది
@ Sujatha garu: Thank you! ఇప్పుడే మీ బ్లాగు చూసానండోయ్! :-)
నా చిన్నప్పుడు గడ్డిపువ్వులు పెట్టుకుని స్కూల్ కి వెళ్ళేదాన్ని.అమ్మ అదేంటే అంటే ఆ పువ్వులు ఎవ్వరు పెట్టుకోరు అవి బాధపడవా? అని అడిగేదాన్ని.
ఎందుకో తెలిదు వాటిని చూస్తె ఏదో పోగొట్టుకున్న ఆత్మీయత వెతుక్కుంటూవచ్చి మనల్ని పలకరిస్తోందా అన్నట్టు ఉంటుంది.
థాంక్స్ అండి. నా బాల్యాని గుర్తుచేశారు.
శైల బాల గారూ..ప్రతి చిరుప్రాణిలో ఆప్యాయతని, మమకారాన్ని వెతుక్కోవటం బహుశా మీకే చెల్లిందేమో! గడ్డి పువ్వులు పెట్టుకోవటం..ఆ భావనే ఎంత బావుంది కదా - వాటికి కూడ విలువ ఇచ్చినట్లు, మీరేమీ తక్కువ కాదు అని చెప్పినట్లు !!
Nenu chinnaoudu chesina Gaddi Pula Project..Oka adhbuthamyna Vijayamu mariyu Garvamu...ipudu kuda nenu vaatine gamanistaanu..bayatiki vellinapudu..Eee madhya maa vuru vellinapudu, panta polaala madhyalo gundaa veltu vunte, arthamayindi..PRAKRUTHI enta andagathe ani...Graameena vaathavaranaaniki..graameenula prema ki vela kattalemani..entha Centralized AC Mall ayinaa..vaati mundu nothing ani..:)
మొవ్వా...బాగా చెప్పావు! చిన్న చిన్న విషయాల్లొనే ఎంతో ఆనందం ఉంది..మనం సరిగ్గా చూడగలిగితే!
Post a Comment